ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
పట్టణ అభివ్రుద్ది లో ప్రజలు భాగస్వామ్యం కావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని 6వ వార్డులో రూ.10 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణం శరవేగంగా విస్తరిస్తుందని, జగిత్యాలలో శివారు ప్రాంతాలు కలపడంతో అభివ్రుద్ది విస్తరించే ప్రయత్నం చేయటం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం సమయంలో రోడ్డు వెడల్పు గా ఉండే విధంగా లే అవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అలాగే పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ఉంచుకునేందుకు ప్రజలు తమ ఇళ్లల్లోని చెత్తను తడి పొడి చెత్త వేరుగా ఇచ్చి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మాజీ జడ్పీటీసీ ముస్కు ఎల్లారెడ్డి, కౌన్సిలర్ చీటి లక్ష్మీ నారాయణ, మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, సురేందర్ రావు, క్యాదసు నాగయ్య, కొలగని మధు, డిఇ ఆనంద్, ఏఈ అనిల్, కౌన్సిలర్ లు, వార్డు నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.