Take a fresh look at your lifestyle.

ఐఐటి మద్రాస్ ఆన్లైన్ కోర్సులకు కోనాపూర్ ప్రభుత్వ పాఠశాల ఎంపిక

కోరుట్ల, ముద్ర విలేకరి: ప్రతిష్టాత్మకమైన ఐఐటి మద్రాస్ పాఠశాల విద్యార్థుల కోసం కోడ్ కనెక్ట్ ప్రోగ్రాం కు కమ్మర్పల్లి మండలం కోనాపూర్ పాఠశాల ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు చౌడారపు రామ్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ద్వారా విద్యార్థులకు ఆధునిక రంగాల్లో విద్యను అందించడంతో పాటు భవిష్యత్తులో తగిన కెరీర్ ఎంపిక చేసుకున్న అవకాశం కల్పించడమే ప్రధాన లక్ష్యం అని 10 ఆన్లైన్ కోర్సులు కాగా, డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఆర్కిటెక్చరల్ డిజైన్, బయోలాజికల్ సిస్టమ్స్, ఫన్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్స్, మ్యాథ్స్ పజిల్స్, ఏరో స్పేస్ ఫండమెంటల్స్, ఇంట్రడక్షన్ టు లా, పర్యావరణ విద్య, సామాజిక శాస్త్రాల పరిచయం కోర్సులు ఉంటాయని అన్నారు. నామమాత్ర రుసుముతో ఐఐటి మద్రాస్ వారు అందిస్తున్నారని తెలిపారు. ఆగస్టు ఒకటి నుండి సెప్టెంబర్ 30 వరకు కోర్సుకాల పరిమితి ఉంటుందని, కోర్సు పూర్తి చేసే విద్యార్థులకు ఐఐటి మద్రాస్ వారు సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.