Take a fresh look at your lifestyle.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ వేం నరేంధర్ రెడ్డి

 

ముద్ర, యాదగిరిగుట్ట :

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ఆయనకు సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ విశేషాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సుభిక్షం, శాంతి, అభివృద్ధి కోసం స్వామి వారి ఆశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.