ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ మండలం ఆవంచ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. చర్లకోల శ్వేత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల ద్వారా యువతలో ఉత్సాహం, క్రమశిక్షణ పెరుగుతాయని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లకు శుభాకాంక్షలు తెలుపుతూ, క్రీడా స్పూర్తితో పోటీలు కొనసాగించాలని సూచించారు.