Take a fresh look at your lifestyle.

భారతదేశ ఐక్యతకు ప్రతీక

  • ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్ రెడ్డి హర్షం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ సిందూర్‌లో భారత సాయుధ దళాలు సాధించిన విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం నిర్వహించిన నిర్దేశిత దాడులు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. ఈ విజయాన్ని జాతీయ సంఘీభావం, ఐక్యతకు ప్రతీకగా భావిస్తున్నట్లు తెలిపారు. ఒక భారతీయ పౌరుడిగా, తాను ముందుగా మన సాయుధ దళాలకు బలంగా అండగా నిలుస్తున్నానని వెల్లడించారు. ఉగ్రవాద నిర్మూలన కోసం భారత సైన్యం చేపట్టిన ఈ ధైర్యవంతమైన చర్య దేశ భద్రతకు నిదర్శనమన్నారు.ఈ దాడులు మన సైన్యం యొక్క సామర్థ్యం, ధైర్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా చాటాయన్నారు. మనమంతా ఒకే గొంతుకై, ఒకే స్వరంతో ప్రకటిద్దాం – జై హింద్!” అని ముఖ్యమంత్రి గారు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.