ముద్ర,తాండూర్ :
వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోలో బుధవారం తాండూర్ డిపో ఆర్టీసీ కార్మికులు బీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య అతిధిగా ప్రధాన కార్యదర్శి నిరంజన్ హాజరైనారు. ఈ సందర్బంగా డిపో బీసీ కమిటీని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా తాండూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ బాల్ రెడ్డి ని నియమించుకున్నారు.
ఆర్టీసీలో బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ కమిటీ పనిచేస్తుందనీ తెలియజేస్తూ ఈ డిపోకమిటీని తాండూర్ డిపోమేనేజర్ పరిచయం చేశారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా శ్రీనివాస్, కార్యదర్శిగా శ్రీనివాస్, వర్కింగ్ ప్రసిడెంట్గా అశోక్, వైస్ ప్రసిడెంట్లుగా శోభ మరియు లక్ష్మిప్రియ, కోశాధికారిగా విజయ్ కుమార్ మరియు మాణిక్యప్ప, చైర్మన్ గా అంజిలయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా .చంద్రకాంత్, వీరప్ప లు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ
కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.