Take a fresh look at your lifestyle.

అల్మాయిపేట గ్రామసభలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నరు – బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

 

నేడు అల్మాయిపేట గ్రామసభలో పాల్గొననున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ

నేడు సంగారెడ్డి జిల్లా,అందొల్ నియోజకవర్గ పరిధిలో అల్మాయిపేట గ్రామంలో నిర్వహించనున్న
“ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా,నిర్వహిస్తున్న గ్రామ సభలో మంత్రి దామోదర్ రాజ నర్సింహ పాల్గొంటున్నట్లు క్యాంపు కార్యాలయం ఇంచార్జీ హన్మండ్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 12:00 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
ప్రజలందరూ హాజరై,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

బాధితురాలికి సీఎంఅర్ఎఫ్ చెక్కు అందజేత

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ ఆశీస్సులతో జోగిపేట 14వ వార్డు కౌన్సిలర్ ఊర్మిళ దుర్గేష్ చేతుల మీదుగా బుధవారం రోజు బాధితురాలు జె.శంకరమ్మకు సీఎంఅర్ ఎఫ్ చెక్కును అందజేశారు.ఈసందర్భంగా ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.