Take a fresh look at your lifestyle.

హెచ్ పివి వ్యాక్సిన్ పై అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించిన —మంత్రి దామోదర్ రాజనర్సింహ.

ముద్ర, ప్రతినిధి సంగారెడ్డి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏ ఏ ఎఫ్ ఏ ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సిన్ పై సోషల్ మీడియా, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించటానికి రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేస్తున్న సామాజికకార్యక్రమాలను అభినందించారు.గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లకు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ రకాల నుండి రక్షణ కల్పించే సురక్షితమైన, అత్యంతప్రభావవంతమైన, దీర్ఘకాలిక రక్షణ కోసం ప్రభుత్వం హెచ్ పివి వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ వ్యాక్సిన్ ను బాల బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని మంత్రి సూచించారు. హెచ్ పి వి వ్యాక్సిన్ ను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోఅందుబాటులో ఉంచామన్నారు. ఈ వ్యాక్సిన్ ను 9 నుండి 14 సంవత్సరాల వయసు గల బాల బాలికలు తప్పనిసరిగా వేసుకునేలా వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.