Take a fresh look at your lifestyle.

సామాజిక న్యాయం చేసేందుకే రిజర్వేషన్లు

  • కేంద్రం కులగణన చేపట్టాడాన్ని స్వాగతిస్తున్నాం.
  • ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ , మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
  • రాహుల్, ఖర్గే, సిఎం, పీసీసీ చీఫ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : సామాజిక న్యాయం చేసేందుకే రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లతోనే నిమ్న వర్గాలు ఫలాలు పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే, డిసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి, తాటిపర్తి జీవన్ రెడ్డి లు అన్నారు. ఎఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కులగణనపై తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాహసిల్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి లు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గత ఎన్నికల ప్రణాళికలో కుల గణన చేపడుతామని హామీ ఇవ్వడం తోపాటు కుల గణన చేపట్టాలనే రాహుల్ గాంధీ డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి కుల గణన చేపడుతామని ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.కుల గణన తోనే ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారికి జనాభా వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. సమాజంలోని నిరుపేద వర్గాలకు న్యాయం చేయాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ కులగనన అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చిందనీ, జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు జాతీయస్థాయిలో నరేంద్ర మోడీ విధి లేని పరిస్థితుల్లో కులగన చేపట్టాలని ముందుకు రావడం జరిగిందన్నారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే నిబంధనలను సవరించి ప్రస్తుతం బలహీన వర్గాలకు అమలు చేస్తున్న 29 శాతం రిజర్వేషన్ల స్థానంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలనీ డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో సైతం రిజర్వేషన్లు అమలయ్యేలా కలెక్టర్లు చొరవ చూపాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాజంగి నందయ్యా, కళ్లెపెల్లి దుర్గయ్య, బండ శంకర్, గాజుల రాజేందర్, బీరం రాజేష్, మన్సుర్ అలీ, నేహాల్, అల్లాల రమేష్ రావు, పుప్పాల అశోక్, నక్క జీవన్, బారీ,గుండా మధు, పూర్ణ చందర్ రెడ్డి, గిరిధర్, రఘువీర్ గౌడ్, తోట నరేష్, గోపు రాజిరెడ్డి, ధ్యావర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.