Take a fresh look at your lifestyle.

99 రోజుల ప్రణాళికఫై సమీక్ష సమావేశం

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 99 రోజుల ప్రణాళికఫై గురువారం మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ ఈ నెల 6 నుండి 15 వరకు పర్యావరణ పరిశుభ్రత, ఫైల్స్ క్లియరెన్స్ పై నిర్వహించబోతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేయవలసిన పనుల గురించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ శ్రీమతి పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జి.రామలింగం వివిధ శాఖ అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.