- జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి.
ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కల్వకుర్తి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని ఎన్నికల్లో వారికి ఓటు వేసే అవకాశం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ ,మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ , రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షులు నీరు కంటి రాఘవేంద్ర గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బృంగి వివేకానంద , జిల్లా కార్యవర్గ సభ్యులు నరేడ్ల శేఖర్ రెడ్డి, పాక్స్ వైస్ చైర్మన్ శ్యామ్, నాయకులు గుర్రాల రాంభూపాల్ రెడ్డి ,బోడ నరసింహ, నర్సిరెడ్డి కిష్టారెడ్డి ,శక్తి కేంద్ర ఇంచార్జిలు, భూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.