ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రాష్ట్ర ప్రభుత్వ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా సింగరేణి రామగుండం1 ఏరియా అధ్వర్యం లో గురువారం అర్జీ1 జిడీకే ఓసి 5 లో ఓబీ డంప్ పైన“వన మహోత్సవ”కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగారామగుండం శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆర్జీ.1 ఏరియా జియం డి.లలిత్ కుమార్ హాజరై పర్యావరణ పతిజ్న చేసి మొక్కలు నాటారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా రామగుండం ఏరియా -1 సింగరేణి అధ్వర్యంలో ఈ వర్షాకాలంలోగా మొత్తం 4 లక్షల మొక్కలను నాటలని లక్ష్యం నిర్దేషించినట్లు తెలిపారు.జిడీకే ఓసి 5 ఓబీ డంప్ పైన 1000 మొక్కలను సామూహికంగా నాటడం జరిగిందన్నారు.ఈ సంవత్సరం జిడీకే ఓసి 5 లో ఓబీ డంప్ పైన సుమారు 110 హెక్టార్లలో మొత్తం 1,60,000 మొక్కలను నాటుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మొక్కలు నాటడం వలన అధిక ఉష్ణోగ్రతలు తగ్గి పర్యావరణ పరిరక్షణకు దోహద పడుతుందని తెలిపారు. రామగుండం ప్రాంతం సింగరేణి, ఎన్.టి.పి .సి, ఆర్.ఎఫ్.సి.ఎల్, సిమెంట్ కార్మాగారం లాంటి పరిశ్రమలతో కూడుకున్నదని,ఆ పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం నుండి రక్షణగాఉండేలా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాల ని తెలిపారు.గోదావరిఖని నగర అభివృద్ధి కోసం సింగరేణి అనుభందంగా అనేక అభివృద్ధి పనులను చేపట్టామని రానున్న రోజులలో గోదావరిఖని పట్టణాన్ని ఒక పర్యాటక ప్రాంతంగాఅభివృద్ధి చేసేలా ప్రణాలికలు సిద్దం చేసామని,రామగుండంప్రాంతాన్ని పచ్చదనం పెంపొందించే మంచి వాతావరాన్ని ఏర్పడే విధంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.సింగరేణి వ్యాప్తంగా ప్రతి అడుగు పచ్చదనం గా ఎక్కడ లేని విధంగా విరివిగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సింగరేణి సంస్థ చైర్మన్ మెనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. బయట ప్రాంతాల కన్నా సింగరేణి ఏరియాలలో ఉష్ణోగ్రత తక్కువగా నమోదు అవుతున్నదని ఇందుకు కారణం సింగరేణి ప్రాంతాలలో సింగరేణి ద్వారా విరివిగా మొక్కలను నాటటం వలన వాతావరణంలో వేడితగ్గుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామీ,బొంతల రాజేష్,దీటి బాలరాజు,పొలసాని శ్రీనివాస్, పెద్దేల్లి తెజశ్వని నాయకులు కొలిపాక సుజాత,పాతిపెల్లి ఎల్లయ్య అధికారులుయస్.ఓ.టు జియం ఆంజనేయ ప్రసాద్, సిఎంఒఐ ప్రతినిధి మేల్లెష్, ఎ.ఐ.టి.యుసి నాయకులు మధన మహేష్, ప్రాజెక్ట్ అధికారి డి.రమేష్, డిజియం ఫారెస్ట్ బానోతు కర్ణ,డి.జిఎం ఏరియా వర్క్ షాప్ జితేందర్ సింగ్, డిజియం సివిల్ వర ప్రసాద్, ఏరియా ఇంజనీరు పి.రమేష్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి,పోనోగోటి శ్రీనివాస్, వేణు, హనుమంత రావు,శ్రావణ్ కుమార్,ఇతర అధికారులు పాల్గొన్నారు.
