Take a fresh look at your lifestyle.

25న జరిగే చేర్యాల బంద్ ను విజయవంతం చేయండి

  • జేఏసీ చైర్మన్ డాక్టర్ ఆర్. పరమేశ్వర్.

ముద్ర, చేర్యాల: రెవెన్యూ డివిజన్ ఏర్పాటే ఏకైక లక్ష్యంగా ఈనెల 25వ తేదీన జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపును విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ పిలుపునిచ్చారు. చేర్యాల మండల కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు దాదాపు 9 సంవత్సరాల క్రితం చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు యువజన సంఘాలు రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కలిసికట్టుగా ఏకమై జేఏసీగా ఏర్పడి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఆకాంక్ష నీరుగారిపోయిందని, గత ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష హోదాలో జనగామ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదే విశ్వాసంతోటి ఈ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఏర్పడిన జేఏసీ ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, దురదృష్టవశాత్తు ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే జేఏసీ ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని, అందులో భాగంగానే ఈనెల 25వ తేదీన చేర్యాల, మద్దూర్,కొమురవెల్లి, ధూల్మిట్ట అన్ని మండలాల్లో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2025 డిసెంబర్ లోపే రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా సాగుతున్నటువంటి ఈ బంద్ కార్యక్రమంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా పాల్గొని పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించచాలని విజ్ఞప్తి చేశారు. ఈ బందుకు విద్యాసంస్థలు మినహాయిస్తున్నట్లు తెలిపారు.ఈ బందులో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు అందె అశోక్, అందె బీరయ్య, జర్నలిస్టు పెండ్యాల రాజు, పోలోజు వెంకటాద్రి , పిల్లి చంద్రం, బండ సాయిలు, ఈరి భూమయ్య, రామగల్ల నరేష్, జంగిలి యదగిరి, సిద్ధిరాం భద్రయ్య, మ్యక లింగం, పుల్ల కుమార్, పుల్ల ఆంజనేయులు, కర్రే నర్సిరెడ్డి, బింగి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.