మహదేవపూర్, ముద్ర:
మండల కేంద్రంలో నిర్వహించబడుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పరీక్ష కేంద్రమును మహదేవపూర్ సిఐ శ్వెంకటేశ్వర్లు, ఎస్ఐ సాయి శశాంక్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, పర్యవేక్షణ ఏర్పాట్లు మరియు భద్రతా చర్యలను తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన సూచనలు ఇచ్చారు.
పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అలాగే పరీక్షల నిర్వహణలో పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.