Take a fresh look at your lifestyle.

శివరాత్రి: భక్తుల కోసం ఆలయాల్లో మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని బిజెపి కొత్త కౌన్సిలర్లు మున్సిపల్‌కు అభ్యర్థన

శివరాత్రికి దేవాలయాల వద్ద మౌలిక వసతులు కల్పించండి
. మున్సిపల్ అధికారులకు మెమోరండం అందించిన నూతన బిజెపి కౌన్సిలర్లు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని శివాలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని బిజెపి నూతన కౌన్సిలర్ అభ్యర్థులు మున్సిపల్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందువుల ఆరాధ్య దైవమైన పండగ శివరాత్రి అని, వేలాది మంది భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి, ఆ పరమ శివుడి దర్శనం కోసం తండోపతండాలుగా ప్రజలు శివాలయం కు వెళ్తుంటారు. కావున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచి నీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు, ఆలయాల పరిశుభ్రత మొదలగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. కార్యక్రమంలో నూతన బిజెపి కౌన్సిలర్లు, నాగారం మల్లేశం, అంతారం కిరణ్, శ్రీకాంత్ రెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.