ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన ముస్లిం సోదరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిష్టతో ఉపవాసం ఆచరిస్తారని పేర్కొన్నారు. రంజాన్ మాసం సమాజంలో సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పవిత్ర కాలమని అన్నారు. కులమతాలకు అతీతంగా అందరికీ ఐక్యతను చాటుతూ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన ముస్లిం సోదర సోదరీమణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముస్లిం సోదరుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.