Take a fresh look at your lifestyle.

బేగంపేట ట్రైనీ పైలట్ కేసు: పోలీసులు హెచ్చరిక

 

ముద్ర మల్కాజిగిరి

బేగంపేటలో ట్రైనీ పైలట్‌పై నమోదైన లైంగిక దాడి కేసులో తప్పుదోవ పట్టించే సమాచారం ప్రచారం అవుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, ఎలాంటి ఊహాగానాలు దర్యాప్తుకు భంగం కలిగిస్తాయని అధికారులు మల్కాజ్గిరి డిసిపి సిహెచ్ శ్రీధర్ తెలిపారు.
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 72 ప్రకారం బాధితురాలి గుర్తింపును బయటపెట్టడం నేరం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పరోక్ష వివరాలు కూడా వెల్లడించరాదు.
మీడియా, సోషల్ మీడియా వేదికలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ధృవీకరించని సమాచారాన్ని పంచుకోవద్దని డీసీపీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఇలాంటి కంటెంట్ షేర్ చేసిన వారు వెంటనే తొలగించాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.