Take a fresh look at your lifestyle.

వాహనాల వేలం పాట లో ఎక్సైజ్ శాఖకు 4,02,380 రూపాయల ఆదాయం

 

 

ముద్ర… తుంగతుర్తి…
ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలకు తుంగతుర్తి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన వేలం పాటలో ఎక్సైజ్ శాఖకు 4 లక్షల 2 వేల380 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ సీఐ రజిత తెలిపారు, ఇట్టి వేలం పాటలో వాహనాల ఎంవీ ఐ అధికారి ఒక లక్ష 84 వేల 500 రూపాయలు నిర్ధారించగా వేలం పాట ధర 3 లక్షల 41 వేలు జీఎస్టీ61 వేల 380 రూపాయలు కలుపుకొని మొత్తంగా నాలుగు లక్షల 2 వేల 380 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఈ వేలం పాటలో 15 ద్విచక్ర వాహనాలు ఒక మినీ డీసీఎం ను వేలంపాటలో ఉంచినట్లు తెలిపారు , ఈ వేలం పాటలో ఉంచిన 15 ద్విచక్ర వాహనాలతో పాటు ఇక మినీ డీసీఎం కూడా వేలంపాటలో ఆసక్తిదారులు పాట పాడి వాహనాలను పొందారని అన్నారు, వేలం పాట కు నిర్వహించే వాహనాలు చూపెట్టిన ధరలో బహిరంగ వేలం ద్వారా పాట నిర్వహించామని తెలిపారు, వాహనాలు వేలంపాటలో కొనాలని ఆసక్తిదారుల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు, ఈ వేలం పాటలో కే స్టీవెన్సన్, ఈసీఐ డిటిఎఫ్ సూర్యాపేట, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు డి, మూర్తి, ఎం జయ ప్రకాష్, తో పాటు సిబ్బంది రామ్మూర్తి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.