Take a fresh look at your lifestyle.

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

  • జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో గాంధీనగర్ ప్రైమరీ స్కూల్ లో, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రూ. 8 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజచేశారు.ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ లైబ్రరీ సెస్ ద్వారా లైబ్రరీల ఏర్పాటు, అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రూ. 35 లక్షలతో రాయికల్ పట్టణం,సారంగాపూర్, చల్ గల్ లో సైతం ఏర్పాటు చేశామని, రూ. 1 కోటితో జిల్లా కేంద్రం ధరూర్ క్యాంప్ లో నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రం లో 11 వ ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్ కూడా జగిత్యాల లో ఏర్పాటు చేసుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన,మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం అడువాల జ్యోతి లక్ష్మణ్,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, డిఇ నాగేశ్వర్,ఎఇ శరన్, నాయకులు బాలే శంకర్, ఆనంద్ రావు, పంబాల రామ్ కుమార్, ముస్కు నారాయణ రెడ్డి,డిష్ జగన్, చేట్పల్లి సుధాకర్, కోలగని సత్యం, కూతురు రాజేష్,పిట్ట ధర్మరాజు ,దుమాల రాజ్ కుమార్ బోడ్ల జగదీష్,గిరి,మహేష్ రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.