Take a fresh look at your lifestyle.

రైతులు కాలానికి అనుగుణంగా మారాలి

  • పంట మార్పిడి తో అత్యధిక దిగుబడి వచ్చి లాభాలు ఆర్జించవచ్చు.
  • ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులు కాలానికి అనుగుణంగా మారాలని, పంట మార్పిడి తో అత్యధిక దిగుబడితో లాభాలు ఆర్జించవచ్చని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల మండలం కల్లెడ గ్రామంలో పొలాస వ్యవసాయ కళాశాల వారి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందన్నారు.నిత్యం ఫెర్టిలేజర్ ఎరువుల పై ఆధారపడటం వల్ల భూసారం దెబ్బతింటుందని, రైతులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల రైతులకు ఉపయోగం ఉంటుందన్నారు.వ్యవసాయంలో నూతన సాంకేతికత ఉపయోగం పెరిగింది..రైతులు ఆవిధంగా ఆలోచన చేయాలి అన్నారు.ఇది ఒక మంచి కార్యక్రమమని, రైతు విజ్ఞాన కేంద్రం ను కళ్ళేడ లో ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని నా సహకారం ఉంటుంది అని అన్నారు.క్రీషి విజ్ఞాన కేంద్రం సైతం జగిత్యాల కు మంజూరు కోసం ఎంపీ అరవింద్ తో కలిసి కేంద్ర మంత్రులను కలవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీజేటిఎయు వైస్ చాన్సలర్ జానయ్య ఎడిఆర్ శ్రీలత, ఎడి సైద నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, శ్యాం, స్వాతి ఎడిఎ తిరుపతి నాయక్, బలరాం, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.