Take a fresh look at your lifestyle.

కూకట్‌పల్లిలో బీఆర్ఎస్‌కు భారీ షాక్: కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత ఎన్. శివానంద్

​ముద్ర కూకట్‌పల్లి :

కూకట్‌పల్లి నియోజకవర్గ రాజకీయంలో భారీ మార్పు చోటుచేసుకుంది. బోయిన్‌పల్లి డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎన్. శివానంద్ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ సమక్షంలో వీరందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలు, సరైన నాయకత్వం లేకపోవడం మరియు పార్టీపై ప్రజల్లో నమ్మకం తగ్గడమే ఈ నిర్ణయానికి కారణమని శివానంద్ వర్గీయులు తెలిపారు. కార్యకర్తల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గాలి బాలాజీ, నాగిరెడ్డి, దండుగల యాదగిరి, షేరీ సతీష్ రెడ్డి, గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, పుష్ప రెడ్డి, విజయలక్ష్మి మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.