ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి, బిఆర్ఎస్ పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు కూనపురి సాంబశివుడు 15వ వర్ధంతిని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోనపురి కవిత రాములు, మాజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య, శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా ఉపాధ్యకులు గుండెబోయిన సురేష్ యాదవ్, నక్కల చిరంజీవి యాదవ్, బెల్లి సూర్యప్రకాశ్ యాదవ్, ర్యాకల రమేష్ యాదవ్, పర్వతం దశరథ, నల్లమాస దానయ్య గౌడ్, సిద్దులు యాదవ్ బతుక అశోక్ యాదవ్, వల్లపూ ప్రవీణ్ యాదవ్, కడారీ పరమేశ్ యాదవ్, శ్రీరాం శరత్ యాదవ్, కూనపురి అభిమానులు నాయకులు పాల్గొన్నారు.