Take a fresh look at your lifestyle.

కామారెడ్డి జిల్లాలో భారీ చోరీ

  • ట్రక్ లో ఉన్న రూ.10 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లు మాయం.

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఆగి ఉన్న ట్రక్కులో గల సెల్ ఫోన్లను దొంగిలించి హాంఫట్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతమైన టేక్రియాల్ హైవే దగ్గర శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. హైవే దగ్గర ఆగి ఉన్న ట్రక్కులో నుంచి రూ. 10 లక్షల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ జాతీయ రహదారి దగ్గర ఓ ట్రక్కులో నుండి సుమారు రూ. 10 లక్షల విలువైన సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు దారి దోపిడి దొంగలు. హైదరాబాదు నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న ఆ ట్రక్కును ఓ దాబా దగ్గర విశ్రాంతి కోసం నిలిపిన సమయంలో ఘటన చోటు చేసుకుంది. విశ్రాంతి కోసం రోడ్డు సైడ్ ట్రక్కు ఆపిన డ్రైవర్ నిద్రలేచి చూడగానే అవాక్కయ్యాడు. ట్రక్కులో నుండి సెల్ ఫోన్ డబ్బాలు ఎత్తుకెళ్లారని గుర్తించిన డ్రైవర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రక్కు డ్రైవర్ ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేసున్నారు.

Leave A Reply

Your email address will not be published.