Take a fresh look at your lifestyle.

వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిపై ఎమ్మెల్యే హరీష్ రావు గెలిచి చూపించాలి-సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్

 

* లక్ష మెజారిటీ ని దెబ్బతీసి చూపించాం

* సమయం వచ్చినప్పుడు సిద్ధిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిపై ఎమ్మెల్యే హరీష్ రావు గెలిచి చూపించాలి అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ సవాల్ విసిరారు . సిద్ధిపేట లో గురువారం మాట్లాడుతూ సిద్ధిపేట నియోజకవర్గంలో గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే హరీష్ రావు లక్ష మెజారిటీ ని దెబ్బతీసి చూపించాం అని అన్నారు. సిద్ధిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలవాలి అని హరీష్ రావు బడాయి మాటలు మాట్లాడుతున్నారు అని సమయం వచ్చినప్పుడు సిద్ధిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని చిత్తుగా మిమ్మల్ని ఓడించే భాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకుంటారన్నారు. సిద్ధిపేట నియోజకవర్గం ప్రజలు కల్వకుంట్ల కుటుంబ పాలన చూసి విసిగి పోయారని సిద్ధిపేట ప్రజలు త్వరలోనే వారసత్వ మీ కుటుంబ పాలనకు బుద్ధి చెపుతారన్నారు . వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువదు అని చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు చెప్పడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ పాలన నచ్చకపోవడంతో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పిన మీ పార్టీ నాయకులకు ఇంకా మార్పు రాలేదా అని ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసం బీఆర్ఎస్ నాయకులు పాకులాడుతున్నారు అని మీరు ఎన్ని నాటకాలు జిమ్మిక్కులు చేసిన ప్రజలు మీ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపించాము అని అన్నారు. హామీలు ఎక్కడ అమలు చేస్తాము అని బిఆరెస్ నాయకులలో భయం పట్టుకుంది అని అందుకే ఎన్ని విమర్శలు చేసి రాజకీయ లబ్ది పొందేందుకు చూస్తుంది అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తో అభివృద్ధి సాధ్యం అవుతుంది అని ప్రజలు నమ్ముతున్నారు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని సిద్దిపేట నుండి గెలిచిన అభ్యర్థికి మంత్రి పదవి రావడం కూడా ఖాయమే అని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కావాలి అని అంటే మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉండేలా ప్రజలు ఆశీర్వదించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాదరి మధు. గయాసుద్దీన్.అర్షద్. నజ్జు. విజయ్ డానియల్. బాబా ఫరీద్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.