ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏర్పాటు చేసే నిమిత్తం బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ భవన్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి అజ్మత్ ఉల్లా హుసేన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావ్ జిల్లాలో పార్టీ అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇంఛార్జి, PCC ఉపాధ్యక్షుడు బండి రమేష్, పిసిసి ప్రధాకార్యదర్శి ఉప్పల శ్రీనివాస్, అబ్జర్వర్ వేణుగోపాల్ యాదవ్, యాదయ్య లతో సమావేశం అయ్యారు. మండల పార్టీ కమిటీ ల గురించి చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు.