Take a fresh look at your lifestyle.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ముద్ర గండిపేట్ : రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గండిపేట మండలం నార్సింగికి చెందిన శ్రీనివాస్ మణికొండలోని ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు.ఈ నెల 2 వ తేదీన విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఓ కారు ఢీకొట్టింది.దీంతో తీవ్ర గాయాలకు గురైన శ్రీనివాస్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థానానికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్ మృతి చెందినట్లు గుర్తించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.కేసు దర్యాప్తులో ఉంది.

Leave A Reply

Your email address will not be published.