ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అడ్వైజర్ మహమ్మద్ షబ్బీర్ అలీ ని సన్మానించిన డిసిసి ప్రధాన కార్యదర్శి ఎండి మజాహర్
ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అడ్వైజర్ మహమ్మద్ షబ్బీర్ అలీని డిసిసి ప్రధాన కార్యదర్శి ఎండి మజాహర్ ఆదివారం ఆయన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాష్ట్ర మైనార్టీ మంత్రిగా అవకాశం రావాలని అలాగే మైనార్టీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎండి బషీర్, ఎండి ఇసాక్, ఎండి దిలావర్, ఎజాజ్,సాయి పాల్గొన్నారు.