- ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సతీమణి రాధిక.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ లో గల శ్రీనగర్ కాలనీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటికో బోనం చొప్పున మహిళలు డప్పు చప్పుల మధ్య బోనాలు ఎత్తుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు.బోనాల పండుగ మహోత్సవానికి రాధిక సంజయ్ హాజరై బోనాల పండుగ శుభా కాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, గౌరవఅధ్యక్షుడు వావిలాలగంగాధర్, అధ్యక్షుడు పసుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి గొల్లపెల్లి శేఖర్ గౌడ్, కోశాధికారి సిరిమల్లె నరసయ్య, కాలనీ కమిటీ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.