ముద్ర, తాండూర్:
తాండూరు బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం గారి ఆధ్వర్యంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం తాండూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త తమతమ ఇంటిపై జెండాలు ఎగరవేశారు. అలాగే ప్రధాన కూడలి అంబేద్కర్ చౌక్ వాల్మీకి నగర్, ఎంపీటీహాల్ వద్ద ఆయా వార్డుల చెందిన కౌన్సిలర్లు బిజెపి జెండాను ఎగరవేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ రావు గారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ గారు రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సాహుశ్రీలత గారు జిల్లా నాయకులు పటేల్ విజయ్ కుమార్ బంటారం భద్రేశ్వర్ 33 వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, 23వ వార్డ్ కౌన్సిలర్ అంతారం కిరణ్, 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు బండారి శ్రీకాంత్ ఇందూర్ రాములు రూపేష్ కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి మంతటి రాజు ఉపాధ్యక్షులు చిద్దిరి ప్రకాష్ కమిటీ సభ్యులు ప్రభాకర్ గౌడ్ చాకలి బిచ్చప్ప కృష్ణ పటేల్ చందు వడ్డే సాయిలు బసవరాజ్ బబ్లు శివాజీ ఠాగూర్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.