కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో, మండల పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు మల్యాల మారుతి మాట్లాడుతూ నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్ష, ఆరవై ఏండ్ల ఆరాటం ప్రజల అస్తిత్వపు ఆత్మగౌరవ పోరాటం, ఈ తెలంగాణ అమరవీరుల పోరాట ఫలితంగా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ వంటి ఎందరో మహనీయుల యోగ దానంతో, స్వరాష్ట్రమై పులకించిన పుడమి తల్లి నా తెలంగాణ మహనీయుల ఆశయాలతో ఆశయ సిద్ధికై అమరవీరుల ఆత్మార్పణ ఫలితంగా అవతరించిన నేల నా తెలంగాణ అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.