Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కోరుట్ల, ముద్ర విలేఖరి: కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసంద్భంగా స్థానిక పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ తో పాటు కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.