Take a fresh look at your lifestyle.

తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం మాట్లాడుతూ
ప్రజా పాలన కాదు (ఇందిరాపాలన)రాక్షస పాలన” అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని,
అలాగే రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వైయంతి, సుర్వి శ్రీనివాస్, పట్టణ ప్రదాన కార్యదర్శి ఉడుత భాస్కర్, ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు రత్నపురం శ్రీశైలం, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాలశంకర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జనగాం కవిత, బెజ్జెంకి రామకృష్ణ రెడ్డి, తుమ్మల నగేష్, ఎరుపుల శివ, కేతరాజు శ్రీనివాస్, కారుపాటి రాజు, బండారు శివశంకర్, తాడూరి రాజు, కొల్లోజు సతీష్, రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం తాసిల్దార్ జగన్ కు వినతి పత్రం అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.