హనుమకొండ, ముద్ర: అంతర్జాతీయ ఆసియా పెసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ 40 వ అంతర్జాతీయ సదస్సు లో వరంగల్ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డా॥ జి.ఆర్. భారత్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది.మూడురోజుల పాటి న్యూ ఢిల్లీలో జరిగిన సదస్సుకు 27 దేశాలనుండి కంటి వైద్య నిపుణులు పాల్గొన్నారు.ఈ అంతర్జాతీయ సదస్సులో శాస్త్రీయ ఉపన్యాసం చేసి అందరిని ఆకట్టుకున్నారు.దీనితో వరంగల్ నగరం నుంచి అంతర్జాతీయ వేదికపై శాస్త్రీయ ఉపన్యాసం (Scientific Lecture) ఇచ్చిన మొదటి నేత్ర వైద్య నిపుణునిగా గౌరవం దక్కించుకున్నారు.డా॥ భారత్ కుమార్ ప్రస్తుతం వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల పాలనాధికారి(Superintendent) గా మరియు కాకతీయ మెడికల్ కాలేజీ ఆప్తాల్మాలజీ విభాగాధిపతి ( హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్) గా సేవలు అందిస్తున్నారు.ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు అభినందనలు తెలిపారు.
