ముద్ర, భువనగిరి ప్రతినిధి :
ఆలేరు మండలం శారజిపేట, గోలనుకొండ ప్రాంతాల్లోని కాల్వలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మంగళవారం పరిశీలించారు.
అశ్వారావుపల్లి నుండి వచ్చే కాల్వల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. శారజిపేట, గోలనుకొండ గ్రామాల చెరువులు నిండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యాల అభివృద్ధి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందన్నారు. రెండు మూడు చోట్ల కాల్వలు మరమ్మతులు చేయడం ధ్వారా నీటి ప్రవాహం సక్రమంగా జరుగుతుందన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి కాల్వలను పునరుద్ధరించాలన్నారు.
ఇలా చేయడంతో శారజిపేట, గోలనుకొండ గ్రామాల చెరువులు నిండి రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల విజ్ఞప్తి మేరకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.