ముద్ర మల్కాజిగిరి:
హోలీ హోలీ రంగ హోలీ చెమ్మకాయ నీలవోలి హోలీ హోలీ రంగవల్లి అంటూ గడ్చిరోలి లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిటికల్ ఇంచార్జ్ మాజీ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను దాదా అలియాస్ భూపతి హోలీ ఆడే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మూడు రోజుల క్రితం తన సొంత గ్రామమైన పెద్ద పెళ్లికి మల్లోజుల వేణుగోపాల్ అతని సహచరి తార వచ్చి కుటుంబ సభ్యులను కలిశారు మళ్లీ గడ్చిరోలికి వెళ్లారు. 40 ఏళ్ల అనంతరం సొంత గ్రామానికి వచ్చిన ఆనందం అంతులేకుండా పోయింది మంగళవారం హోలీ పండుగ కావడంతో గడ్చిరోలి ఉన్న ప్రజలతో మల్లోజుల వేణుగోపాల్ హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు ఒకరినొకరు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు