Take a fresh look at your lifestyle.

జాతీయ స్థాయి క్రికెట్ లో రాణిస్తున్న కానిస్టేబుల్ సాయి ఎస్పీచే సన్మానం, నగదు ప్రోత్సాహకం అందజేత

ముద్ర ప్రతినిధి, మెదక్:
జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారుడు కానిస్టేబుల్ సాయి కుమార్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఘనంగా సన్మానించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. క్రీడా రంగంలో ఆయన సాధించిన విజయాలను గుర్తించి అభినందించారు.
తిరుపతిలో ఇటీవల నిర్వహించిన సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌లో సాయి అద్భుత ప్రదర్శనతో జట్టును సెమీ ఫైనల్‌ వరకు చేర్చడం, ఎలైట్ క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో తెలంగాణ పోలీస్ క్రికెట్ జట్టు విజేతగా నిలవడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. ఈ విజయాలతో జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకువచ్చారని ఎస్పీ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ శైలేందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, సీసీ రాజేందర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.