ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
కేటిదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట శ్రీక్ష్మీవెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన బీజేపీ మండల నాయకులు భీంరెడ్డి కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొన్ని నూతన వదూవరులను ఆశీర్వదించారు.

ఆమె వెంటా బీజీపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, నల్లారెడ్డి, మండలాధ్యక్షుడు శ్రీపాదరెడ్డి, అనిమిరెడ్డి, హంపిరెడ్ఢి, సర్పంచ్ రాజేష్, కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.