ముద్ర ప్రతినిధి, జోగుళాంబ గద్వాల:
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆర్వోబి ప్లైఓవర్ కిందా ఆదివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు గద్వాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.

గద్వాల సీఐ టి.శ్రీను అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని తెలిపారు. మృతుడు తీవ్ర మైన రక్తగాయాలతో ఉన్నాడని, మృతుడి ముఖం మీద బలమైన బండరాయితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడ్ని గుర్తు పడితే గద్వాల పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.