Take a fresh look at your lifestyle.

చిరు వ్యాపారులకు, ఇంటి యజమానులకు అండగా ఉంటా

  • జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.
  • రోడ్డు విస్తరణ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దు.
  • డీఈ రాజారాం ను ఆదేశించిన ఎమ్మెల్యే పల్లా.

ముద్ర, చేర్యాల: పట్టణంలోని నేషనల్ హైవే రోడ్డు వెడల్పులో రోడ్డు నిర్మాణం చేపట్టి సంవత్సరం గడిచిన తర్వాత ఇటీవల కాలంలో అదనంగా 5 పీట్ల స్థలం వదిలిపెట్టాలని మార్కింగ్ చేసి ఇంటి యజమానులను భయభ్రాంతుల గురిచేస్తున్న నేషనల్ హైవే అధికారులు, మున్సిపల్ అధికారుల తీరుపై గత రెండు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న క్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి మంగళవారం సిపిఐ నాయకులు చేర్యాల పట్టణంలో నెలకొన్న రోడ్డు సమస్యలపై వినతి పత్రం సమర్పించి వివరించడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జాతీయ రహదారి ఎన్. హెచ్ డీఈ రాజారామ్ తో చరవాణిలో మాట్లాడారు. ఎంతో కష్టపడి ఇబ్బందులతో ఇండ్లు నిర్మించుకున్నారని రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోతున్న చిరు వ్యాపారులకు ఇంటి యజమానులకు సహకరించాలని, గత సంవత్సరం క్రితం 45 ఫీట్లు వదిలి పెట్టి నిర్మాణాలు చేపట్టారని వారిని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. చిరు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి ప్రజలకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేకు సిపిఐ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల సహాయ కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి, ఆరుట్ల లింగం, చింతల రఘుమహారాజు లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.