Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే కుంభం చిత్రపటానికి పాలాభిషేకం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి 22వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో స్థానిక వినాయక చౌరస్తా వద్ద బుధవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ముందుగా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విగ్నేష్ మాట్లాడుతూ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, యువ నాయకురాలు కీర్తి రెడ్డి పట్టణంలో మునిసిపల్ ఎన్నికల సందర్భంగా జనరల్ మహిళా చైర్మన్ స్థానంలో, జనరల్ వైస్ చైర్మన్ స్థానంలో ఇద్దరు బిసిలకు ముఖ్యంగా అత్యంత వెనుకబడిన కులం విశ్వబ్రాహ్మణ కులానికి చైర్మన్, మరో బిసి కి వైస్ చైర్మన్ (ఇద్దరు మహిళలు) అలాగే జనరల్ స్థానంలో SC లకు టికెట్ ఇచ్చి అన్ని రకాల సహాయ సహకారాలు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో, సళ్ళా కిశోర్ , బట్టు మహేందర్, బుషపాక మనీష్, బుషపాక రాకేష్, కోళ్ల ప్రవీణ్, కొండమడుగు రాజు, ప్రమోద్, మని, సాదిక్, వరుణ్, శివ గణేష్, నరేష్, నాగేంద్ర బాబు, విజయ్, పాడిగేలా రాజు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.