Take a fresh look at your lifestyle.

రేపటితో ముగియనున్న పోటీ పరీక్షల ఉచిత శిక్షణ దరఖాస్తు ల స్వీకరణ….

 

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి -ఈ నెల 22 లోగా టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ లో పో టీ పరీక్షల ఉచిత శిక్షణ కు దరఖాస్తు చేసుకోవాలి

-ఎస్సీ బిసి ఎస్టీ అభ్యర్థులు అర్హులు

– జిల్లా ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ అధికారి అఖిలేష్ రెడ్డి టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ లో గ్రూప్ 1,2,3,4, ఆర్ ఆర్ బి, ఎస్ఐ , కానిస్టేబుల్, ఎస్ ఎస్ సి తదితర పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కు దరఖాస్తు ఈ నెల 22 లోగా చేసుకోవాలని జిల్లా ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ అధికారి అఖిలేష్ రెడ్డి , టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ లు తెలిపారు. పోటీ పరీక్షలకు 5 నెలల ఫౌండేషన్ కోర్సు ద్వారా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి 3 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ బీసీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్ లో tsstudycircle . co.in లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 1 న స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి 5 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ తో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు ఫోన్ నం 91822 20112 లో సంప్రదించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.