- మంత్రి దామోదర రాజనర్సింహా.
ముద్ర,తెలంగాణ బ్యూరో :ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పై నమ్మకం, విశ్వాసం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యం తో ప్రభుత్వ ఆసుపత్రులను బ్రాండింగ్ చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు మంగళవారం రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు కార్యాలయంలో మంత్రి రాజనర్సిహ్మా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల బ్రాండింగ్ పై శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా పవర్ పాయింట్ ద్వారా చేపట్టే అంశాలను వివరించారు.అనంతరం మంత్రి రాజనర్సింహా మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవల బలోపేతానికి నిర్దిష్టమైన విధానాలను రూపొందించి అమలు చేయాలన్నారు.ఈ సమీక్షలో టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డీఎంఈ ప్రత్యేకాధికారిణి డాక్టర్ విమల థామస్, టీడీఎంఎస్ఐడీసీ సీఈ దేవేందర్ పాల్గొన్నారు.
