ముద్ర/కథలాపూర్, ముద్ర; తీవ్ర మనస్థాపం చెంది రైతు ఆత్మహత్య ఘటన జగిత్యాల కథలాపూర్ మండలం కలికోట గ్రామం లో జరిగింది. పోలిసులు అందించిన వివరాల ప్రకారం కలికోట గ్రామానికి చెందిన లక్కం పెద్ద గంగారం 47 అనే వ్యక్తి గత కొద్ది రోజుల నుండి ఆరోగ్యం సరిగా లేక పలు మార్లు హాస్పిటల్ లో చూపించుకున్న తగ్గక పోగా తీసుకున్న అప్పు విషయంలో ఎలా తీర్చాలని ప్రతిరోజు బాధపడుతూ 1వ తేదీ రోజున సాయంత్రం సమయంలో గ్రామ శివారులోని వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న తన వ్యవసాయ భూమి వద్ద గల చెట్టుకు తాడుతో ఉరివేసుకొని చనిపోయాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య లక్ష్మీ పిర్యాధు మేరకు ఎస్ఐ జి. నవీన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
