Take a fresh look at your lifestyle.

మోటకొండూర్ లో ఉత్సహభరితంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం

 

ముద్ర, శేరిలింగంపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1990 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పదవ తరగతి వరకు ఇక్కడ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ వృత్తులు,హోదాల్లో స్థిరపడ్డారు. వీరంతా ఈ కార్యక్రమానికి హాజరై తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించుకున్నారు. అప్పట్లో తమకు గురువులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చదువుకునే రోజుల్లో అలనాటి జ్ఞాపకాలు, అనుభూతులను ఒకరికొకరు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు ప్రస్తుత విద్యార్థుల క్రీడా అవసరాల కోసం రూ.10,000 నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రఘురాం రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమానికి పూర్వ ఉపాధ్యాయులు కొంతం అంజిరెడ్డి, పైళ్ళ కృష్ణారెడ్డి, బండ్రు రాజమల్లయ్య, అనంతుల బుచ్చిరెడ్డి, భాస్కరరావు, మధురవాణి హాజరయ్యారు. కార్యక్రమంలో దాదాపు 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.