ముద్ర, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి డివిజన్ బాపునగర్ లోని ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఈద్గా ను ముస్లిం మత పెద్దల ఆహ్వానం మేరకు పాల్గొని పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.. ఈద్గా ఒకేసారి వేల సంఖ్యలో ప్రజలను ఏకం చేస్తుందని ఇది కుల, మత, ఆర్థిక వ్యత్యాసాలు లేకుండా అందరూ భుజం భుజం కలిపి ప్రార్థించేలా చేస్తూ సామాజిక సమానత్వాన్ని చాటే ఒక పవిత్రమైన ప్రదేశమని పేర్కొన్నారు.
ఈద్గా ను కాపుడుకునే భాద్యత మనందరిపై ఉందని ఎవరు అపోహాలకు గురవద్దని ఏ చిన్న సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే గారి సహకారంతో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా తాను కార్పొరేటర్ గా గెలిచిన వెంటనే ముస్లిం సోదరుల కొరకు ఈద్గా ఆవరణలో స్టోన్ ఫ్లోరింగ్ వేయించానని, అది ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నందున సీసీ ఫ్లోరింగ్ వేయిస్తానని హామీ ఇచ్చారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గా, కబురుస్తాన్ లలో పరిశుభ్రత పాటించాలని, పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకొని శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్డు, స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై తదితరాలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించానని, సాధ్యమైనంత త్వరగా పనులను ప్రారంభించి పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జాకీర్, ఇక్బాల్, రాజ్ కుమార్, ఆజాం, గఫర్, జావేద్, ఖాదర్ ఖాన్, అశోక్, షేబాజ్ యాబా, టిల్లు, తాహెర్, దస్తగిర్, అలీం, అజాజ్, షకీల్, రియాజ్, ముక్రం, షాకీర్, గౌస్, ఖలీం, మహేష్ చారీ, ముంతాజ్ బేగం స్థానిక ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు