- బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు.
అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను అమ్రాబాద్ పోలీసులు ముందస్తు గా అరెస్టు చేశారు. ఈ అరెస్టు కు నిరసనగా బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తే అరెస్టు చేయడం హేమమైన చర్య నా చెంచు సోదరులకు ఇచ్చే ఇండ్లలో కేంద్రం వాటా రాష్ట్రం వాటా ఎంతనో మంత్రి శ్వేత పత్రం విడుదల చేసి ప్రజలకు తెలియజేయాలని నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ ఇందిరమ్మ ఇండ్ల పట్టాల మరియు నిర్మించే ఇండ్ల విషయంలో పారదర్శకత ఉండాలని కేవలం నిరుపేద కుటుంబాలకు ఇండ్లు లేని వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని నాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి అమ్రాబాద్ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ జిల్లా నాయకులు నోముల శంకర్ గౌడ్ బాత్క అరవింద్ యాదవ్ నోముల అంజన్ గౌడ్* తదితరులు పాల్గొన్నారు.