Take a fresh look at your lifestyle.

న్యాయవాదులు సంక్షేమానికి కృషి చేస్తా

ముద్ర, మొయినాబాద్: కోర్టుల్లో ప్రజలపక్షాన న్యాయస్థానాల్లో వాదించే న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని రాజేంద్రనగర్ కోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మామిడి మధుసూదన్రెడ్డి పేర్కోన్నారు. ఇటీవల బార్ అసొసియేషన్ ఉపాద్యక్షుడిగా ఎన్నికైన మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మామాడి మధుసూదన్ రెడ్డి శుక్రవారం రాజేంద్రనగర్ కోర్టులో నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు.కక్షిదారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.అదే విధంగా బార్ మరియు బెంచ్ల సంబంధాలు అన్ని విదాలుగా సహకరించే విధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా అద్యక్షునిగా కాసొజు యాదగిరి, ప్రదాన కార్యదర్శిగా బందయ్య, సంయుక్త కార్యదర్శిగా జ్ఞానేశ్వరాచారి, మహిళా కార్యదర్శిగా అనిత, కోశాధికారిగా లక్ష్యయ్య లైబ్రేరియన్గా అమృత్రెడ్డి,స్పోర్ట్స్ కార్యదర్శిగా కిరణ్ అదే విధంగా కార్యవర్గ సభ్యులుగా భగీం దర్సింగ్, యశ్వంత్, మహేందర్రెడ్డి, రాజు, రమేష్లు గెలుపొందారు.

Leave A Reply

Your email address will not be published.