ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సర్దార్ స్వరాయి పాపన్న గౌడ్ గారి 316వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గౌరవనీయులు ఎమ్మెల్యే పాపన్న గౌడ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని పాపన్న గౌడ్ సేవలను స్మరించుకున్నారు. ఆయన చూపిన ధైర్యసాహసాలు, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పలువురు నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాపన్న గౌడ్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మాజీ ఎమ్మెల్యే మోహన్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పకిరాయ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మల్లయ్య గౌడ్, వెంకటయ్య గౌడ్, నారాయణ గౌడ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.