తుంగతుర్తి ముద్ర :- ఎన్నికల ముందు రైతులకు రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు 15000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్న కాంగ్రెస్ పార్టీ సర్కార్ నేడు వాగ్దానాన్ని తుంగలో తొక్కి 12,000 ఇస్తానని అనడం రైతులను మోసం చేయడం కాదా అని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య ప్రశ్నించారు. సోమవారం మండల పరిధిలోని దేవుని గుట్ట తండాలో రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పినందుకు నిరసనగా రైతులతో కూడి నిరసన తెలియజేసిన సందర్భంగా మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 15000 చెల్లించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులందరితో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు .మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన సర్కార్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలం విఫలమైందని విమర్శించారు. ఈ సందర్భంగా రైతు నిరసన కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్ ,తునికి సాయిలు గౌడ్ ,గాజుల యాదగిరి ,మాజీ సర్పంచ్ వీరోజి ,పాండు నాయక్, భద్రు నాయక్, సైదమ్మ ,విజయ, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు