Take a fresh look at your lifestyle.

అధికారులపై జూపల్లి ఫైర్

  • రాష్ట్ర గీతం పట్ల శ్రద్ధ లేకపోతే ఎలా అంటూ అధికారులపై సీరియస్.
  • సంబంధిత సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు.

అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో గిరిజన భవన్ లో చెంచులకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో రాష్ట్ర గీతం పెట్టినప్పుడు ఆడియో సరిగా వినిపించలేదని ఏర్పాట్లకు సంబంధించిన సిబ్బంది, అధికారుల పైన మంత్రి జూపల్లి సభాముఖంగా ఫైర్ అయ్యారు. రాష్ట్ర గీతం అంటే మీకు గౌరవం లేదా ఇలాగేనా ప్రవర్తించేది సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం లేదా మీకు అని అధికారులపై సిబ్బందిపై నిప్పులు చెరిగారు. వెంటనే సంబంధించిన వ్యక్తులను అధికారులను, సిబ్బందిని, సస్పెండ్ చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.